కోహ్లీ వందో టెస్టు…బీసీసీఐ అవకాశమివ్వాలి:గవాస్కర్

91
gavaskar

దేశవ్యాప్తంగా కరోనా,ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ బాటపట్టగా పెద్ద సినిమాల విడుదల ఆగిపోయింది. ఇక కరోనా,ఒమిక్రాన్ ఎఫెక్ట్ క్రికెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ త్వరలోనే అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. తన టెస్టు కెరీర్‌లో వందో టెస్టు ఆడనుండగా అది బెంగళూరులో శ్రీలంకతో జరగనుంది. అయితే ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా బెంగళూరులో జరిగే టెస్టులో ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంటుందో లేదో తెలియదని సన్నీ వ్యాఖ్యానించాడు.

కానీ వందో టెస్టులో అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో అభినందనలు అందుకోవడానికి కోహ్లీ అర్హుడని.. అందుకు బీసీసీఐ అవకాశమివ్వాలని గవాస్కర్ కోరాడు. కాగా భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 12వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు.