పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ సంపాధించుకున్న సంగతి తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ చేసే అప్ కమింగ్ మూవీస్ కోసం ఇటు సౌత్ లోనూ అంటూ నార్త్ లోనూ ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఆగష్టు 15 విడుదల కాబోతుంది. అయితే ఈ మూవీ తరువాత బన్నీ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆ మధ్య త్రివిక్రమ్ తో మూవీకి కమిటైనప్పటికి గుంటూరు కారం రిజల్ట్ తో ఆ ప్రాజెక్ట్ ను బన్నీ హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో క్రేజీ డైరెక్టర్ పేరు తెరపైకి వచ్చింది. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగా తో బన్నీ మూవీ చేసే ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. .
సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తర్వాత ప్రభాస్ స్పిరిట్ చేయాల్సి ఉంది కానీ ప్రస్తుతం ప్రభాస్ కల్కి, రాజసాబ్ వంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా హను రాఘవపూడితో మూవీ చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడట. దీంతో స్పిరిట్ మూవీని పక్కన పెట్టి బన్నీ కోసం స్క్రిప్ట్ తయారు చేసే పనిలో ఉన్నడట సందీప్ రెడ్డి వంగా. బన్నీ తో యానిమల్ మూవీని మించేలా క్యారెక్టర్ డిజైన్ చేస్తునట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు ‘ఎలిఫెంట్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికి ఇండస్ట్రీలో మాత్రం రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి పుష్ప తరువాత నిజంగానే బన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించబోతున్నాడా ? లేదా లైన్ లో ఉన్న త్రివిక్రమ్ తోనే ఆర్జేక్ట్ అవుతాడా అనేది చూడాలి.
Also Read:అప్పుల ఊబిలో సీనియర్ హీరో