‘మైఖేల్’గా సందీప్‌ కిషన్‌.. ఆసక్తిరేపుతున్న పోస్టర్‌..

98

హీరో సందీప్ కిషన్ హిట్లు.. ఫ్లాఫ్‌లకు సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూకుడుగా వెళుతున్నాడు. సందీప్ నటించిన తాజా చిత్రంగా ‘గల్లీ రౌడీ’ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్‌ హీరో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రంజిత్ జయకొడి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను భరత్ చౌదరి – రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘మైఖేల్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

రక్తంతో తడిసిన చేతులు.. ఒక చేతికి బేడీలు వేసి ఉన్నప్పటికీ.. మరో చేత్తో శత్రువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నతీరు పోస్టర్‌లు కనిపిస్తోంది. విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. దాదాపు అది ప్రతినాయకుడి పాత్రనే అనుకోవాలి. ఈ సినిమా కోసం ఆయనను తీసుకోవడంతో మరింతగా అందరిలో ఆసక్తి పెరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ.. మలయాళ.. కన్నడ.. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.