సందీప్ కిషన్,హన్సిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బి.ఎ బి.ఎల్’.జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. సందీప్ కిషన్ లాయర్ పాత్రలో కనపడుతున్నాడు. ఇందులో మరో కీలక రోల్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో సందీప్ కిషన్ కేసులు వాదించడం కోసం ఆఫర్స్ ఇస్తుంటారు. ఒక కేసు వాదిస్తే రెండో కేసు ఫ్రీ, పేటీఎంలో పే చేస్తే 50 శాతం క్యాష్ బ్యాక్. కేసు పూర్తిగా ఓడిపోతే 100 శాతం క్యాష్ బ్యాక్ అని బంపర్ ఆఫర్స్ ఇస్తున్నాడు. టీజర్ చూస్తుంటే ఈ చిత్రంతో సందీప్ కిషన్ హిట్ కొట్టేలావున్నాడు.