రివ్వూః ‘తెనాలి రామకృష్ణ’ బి.ఎ, బి.ఎల్

958
Tenali Ramakrishna
- Advertisement -

యువ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో హన్సిక హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్. వరలక్ష్మీ,మురళీ శర్మ,సప్తగిరి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించగా SNS క్రియేషన్స్ పతాకంపై సినిమాను నిర్మించారు. సాయి కార్తిక సంగీతం అందించారు. యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈచిత్రంనేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమాలో సందీప్ కిషన్ ప్రేక్షకులను మెప్పించాడో లేదో చూద్దాం..

కథః చెట్టు కింద ప్లీడర్ తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్). ఎన్ని ఆఫర్లు ఇచ్చినా తన దగ్గరికి కేసులు రావు. తన తండ్రి మాత్రం కొడుకు ఒక పెద్ద కేసు వాదించి గెలిస్తే చూడాలని ఆశపడుతుంటాడు. ఎంతకీ కేసులు రాకపోవడంతో పెండింగ్ కేసుల గురించి తెలుసుకుని ఇరు వర్గాల్ని రాజీ చేస్తూ సొమ్ము చేసుకుంటాడు. ఇంతలో పేరు మోసిన రాజకీయ నాయకురాలు వరలక్ష్మీ దేవి (వరలక్ష్మీ శరత్ కుమార్) కేసు తగులుతుంది. తన జీవితాన్ని మలుపు తిప్పే కేసు ఇదే అని సవాల్ గా భావించి కోర్టులో కేసు వాదిస్తాడు. తొలిసారిగి కేసు గెలుస్తాడు. ఆ తర్వాత వరలక్ష్మీకి తెనాలి రామకృష్ణకి మధ్య జరిగిన పోరులో ఎవరు గెలుస్తారు? రుక్మిణి(హన్సిక) తో తెనాలి ప్రేమ విషయం ఎక్కడి వరకు వెళ్లిందే అంటే ఈసినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ః
హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ పాత్రలో పర్వాలేదనిపించాడు. తనలో సీరియస్ యాక్టరే కాదు కామెడీ ఉందని ఈ సినిమాతో నిరూపించాడు. అక్కడక్కడ రాజేంద్ర ప్రసాద్, అల్లరి నరేష్‌లను ఇమిటేట్ చేసినట్టు ఉన్న తనదైన కామెడీ టైమింగ్ పండించాడు. హీరోయిన్‌గా నటించిన హన్సిక మరో లాయర్ పాత్రలో నటించినా.. కేవలం గ్లామర్ షోకు మాత్రమే పనికొచ్చింది. ఇక మరో ముఖ్యపాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. అంతేకాదు తనదైన నటనతో ఆకట్టుకుంది. మొత్తానికి సందీప్ కిషన్ నటన, కామెడీ సినిమాకు ప్లస్ గా మారింది. సాయి కార్తీక్ సంగీతం, సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుందని చెప్పుకోవాలి.

మైనస్ పాయింట్స్ః
కథ మెల్లిగా సాగడంతో ప్రేక్షకులు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. కామెడీ మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే చూపించి సెకాండఫ్ లో అసలు కామెడీకి ఎక్కడా ఆస్కారం లేకపోవడం సినిమాకు మైనస్ గా చెప్పుకోవచ్చు.. వరలక్ష్మీ శరత్ కుమార్ పోషించిన విలన్ పాత్రని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పుకోవాలి. కథలో కొంచెం కొత్తతనం ఉంటే బాగుండేదని ఫీలవుతున్నారు ప్రేక్షకులు.

సాంకేతిక విభాగంః
దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి తనకు మాత్రమే తెలిసిన కామెడీ జానర్‌లో ఈసినిమాను తెరకెక్కించాడు. తనదైన శైలిలో కామెడీ పంచ్‌లు సన్నివేశాలు అల్లుకోవడంలో బాగనే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి తనదైన కామెడీని పక్కనపెట్టి.. సినిమాను పూర్తిగా సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లాడు. నిర్మాణ పరంగా బాగున్నాయి.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అక్కడ అక్కడ లాజిక్‌లు మిస్సైయిన మాస్ ప్రేక్షకులను మాత్రం అలరించేలా ఉంది.

తీర్పుః
సందీప్ కిషన్ కు తన సినిమా కెరీర్ లో ఒక్క వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తప్ప మరో హిట్ లేదు. చాలా రోజులుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్నా తెనాలికృష్ణ సినిమాతో మరో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకోవచ్చు.. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ కోర్టులో గెలిచినా.. థియేటర్లో మాత్రం గెలవలేకపోయాడని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

విడుదల తేదీ: 15/11/2019
రేటింగ్:2/5
న‌టీన‌టులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ,మురళీ శర్మ,సప్తగిరి, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
నిర్మాతలు : SNS క్రియేషన్స్
దర్శకత్వం: జి.నాగేశ్వర్ రెడ్డి

- Advertisement -