రోడ్డు ప్రమాదంలో గాయని గీతా దుర్మరణం..

166
Singer Geethamali

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతామాలీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబయి- ఆగ్రా హైవేపైన ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. వివరాల్లోకి వెళ్తే, తన భర్త విజయ్ తో కలిసి గీతా మాలి అమెరికా వెళ్లారు. రెండు నెలల టూర్ తర్వాత వారు ఇండియాకు తిరిగి వచ్చారు. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే… ఓ సెల్ఫీని ఫేస్ బుక్‌లో గీత షేర్ చేశారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ తమ సొంత ఊరైన నాసిక్ కు ముంబై-ఆగ్రా హైవేపై బయల్దేరారు.

Singer Geethamali

తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డు పక్కన పార్క్ చేసిన ఓ కంటెయినర్‌ను వారు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ హుటాహుటిన సమీపంలో ఉన్న షాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గీత మృతి చెందారు. ఆమె భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరాఠీ సినిమాల్లో ఎన్నో పాటలను పాడిన గీత… సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్ లను కూడా రూపొందించారు.