ఫిలిమ్ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు అంత ఆశ్చర్యపడే విషయం అంటనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘ప్రాజెక్ట్ జెడ్’ అనే సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయింది. అయితే పెద్దగా ప్రమోషన్ చేయకపోవటం కారణంగా ఈ సినిమా రిలీజ్ అయిన విషయం కూడా అధిక శాతం ప్రేక్షకులకు తెలియలేదు. అందుకే చాలా తక్కువ కాలెక్షన్ చేసిందట ఈ సినిమా.
తమిళ్ లో బాగానే ఆడిన ‘మాయవన్’ కి ఇది డబ్బింగ్ వెర్షన్. దీని గురించే సందీప్ కిషన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తనకు నిర్మాతకు తెలియకుండా అనధికార ప్రింట్‌ను శుక్రవారం థియేటర్స్‌లో వేసారని – ఇందులో తన వాయిస్ కూడా డబ్ కాలేదని – వేరే ఎవరిదో ఉందని ఆరోపిస్తూ అసలు విడుదలకు తాము క్లియరెన్స్ ఇవ్వలేదని కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఒక అభిమాని సందీప్ కిషన్ కి సినిమా బాగుంది అని ట్వీట్ చేసే దాకా ఈ విషయమే తెలియలేదట.
ఇల్లీగల్ స్క్రీనింగ్ జరగడానికి కారణమైన వారిని శిక్షించాలని పోలీస్ కేసు కూడా పెట్టారట. తమిళంలో మంచి టాక్ తెచ్చుకున్న మాయావన్ చిత్రాన్ని సీవి కుమార్ తెరకెక్కించగా, గిబ్రాన్ సంగీతం అందించాడు.ఈ మూవీలో లావణ్య త్రిపాటి హీరోయిన్గా నటించింది.