సందీప్ కిష‌న్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఫ‌స్ట్‌లుక్…

48
sandeep

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న లేటెస్ట్ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. లావ‌ణ్యా త్రిపాఠి హీరోయిన్‌. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు.

ఏ 1 ఎక్స్‌ప్రెస్ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్ట‌ర్‌లో సందీప్ కిష‌న్ ఎయిట్ ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ ప‌ట్టుకుని మ‌రో చేతితో త‌న చొక్కాని స్టేడియంలో ఊపుతున్న‌ట్లు చూపించారు. విజయం యొక్క ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ కి ఇది ప‌ర్‌ఫెక్ట్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్.

ఈ పోస్ట‌ర్‌కి గేమ్ బిగిన్స్ ఇన్ థియేట‌ర్స్ సూన్‌ అనే క్యాప్ష‌న్‌ను జోడించారు. త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది.

సందీప్ కిష‌న్ 25వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రం ప‌ట్ల‌ ప్రేక్ష‌కుల్లో అమితాస‌క్తి వ్య‌క్త‌మ‌వుతుండ‌గా, త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేస్తున్నారు. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపుపొందిన ఈ మూవీలో హిప్ హాప్ తమిళ స్వ‌రాలు కూర్చిన సింగిల్ కింగులం పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఏ1 ఏక్స్‌ప్రెస్‌‌ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.

తారాగ‌ణం:
సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా, పార్వ‌తీశం, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి

సాంకేతిక బృందం:

ద‌ర్శ‌కుడు: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను

నిర్మాత‌లు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం

స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌

మ్యూజిక్‌: హిప్ హాప్ త‌మిళ‌

సినిమాటోగ్ర‌ఫీ: కెవిన్ రాజ్‌

ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌

సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, సామ్రాట్‌

ఆర్ట్‌: అలీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: శివ చెర్రీ, సీతారామ్‌, దివ్య విజ‌య్‌, మ‌యాంక్ సింఘానియా

పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్