సండే స్పెష‌ల్ షూటింగ్ పూర్తి..

105
tollywood

రియాన్ష్‌, నిత్య‌శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం సండే స్పెష‌ల్‌. ఆద్యంతం అలరించే ఈ హ్యూమరస్ థ్రిల్లర్ చిత్రాన్ని మ్యాన్‌కైండ్ & పెలికుల 24 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేని ద‌ర్శ‌క‌త్వంలో రామ‌కృష్ణ బ‌లుసు మ‌రియు జ్యోతి బాజినేని నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల న‌వ‌దీప్ చేతుల‌మీదుగా విడుద‌లైన‌ ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సండే స్పెష‌ల్ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయనున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌.

తారాగ‌ణం: రియాన్ష్, నిత్యా శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేని
నిర్మాత‌లు: రామకృష్ణ బ‌లుసు, జ్యోతి బాజినేని
బ్యాన‌ర్‌: మ్యాన్‌కైండ్ మూవీస్ & పెలికుల‌24 మోష‌న్ పిక్చ‌ర్స్
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
లిరిక్స్‌: శ్రీ‌నివాస మౌళి
సినిమాటోగ్ర‌ఫి: అభి పెయ్యాల‌
డిఐ& ఎడిటింగ్‌: డాలీ శంక‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: శివ‌ న‌రిశెట్టి.