TTD:హనుమంత వాహనంపై సుందరరాజస్వామి

8
- Advertisement -

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు రెండవ రోజు వైభవంగా సాగాయి.ఉదయం 10 -11గం.ల మధ్య స్వామి వారికి కళ్యాణోత్సవం చేపట్టారు.

మధ్యాహ్నం 3 – 4 గం.ల మధ్య శ్రీ కృష్ణ‌స్వామివారి ముఖ మండపంలో శ్రీ సుందరరాజ స్వామివారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, పసుపు, చందనాల‌తో వేడుకగా అభిషేకం నిర్వ‌హించారు.

ఇవాళ సాయంత్రం 5.45 – 6.15 గం.ల మధ్య ఊంజల్ సేవ చేపట్టనున్నారు. రాత్రికి 7 – 8.30 గం.ల మధ్య హనుమంత వాహనంపై నాలుగు మాడ వీధుల్లో స్వామివారు విహరిస్తారు.

జూన్ 19న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు ముగియనున్నాయి. రాత్రి 7 – 8.30 గం.ల మధ్య గరుడ వాహనంపై స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

Also Read:కుబేర…డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

- Advertisement -