I Love Pakistan..ట్రంప్ సంచలనం

8
- Advertisement -

“I LOVE PAKISTAN” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ గొప్ప వ్యక్తి.. గత రాత్రే ఆయనతో మాట్లాడానని తెలిపారు.ట్రేడ్‌ డీల్‌ గురించి చర్చించా.. రెండు న్యూక్లియర్‌ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపానంటూ వ్యాఖ్యానించారు.

యుద్ధాన్ని ఆపేశాను… నాకు పాకిస్థాన్ అంటే ఎంతో ఇష్టం. మోదీ అద్భుతమైన నాయకుడు. నేను ఆయనతో నిన్న రాత్రే మాట్లాడాను. మేము భారత ప్రధాని మోదీతో ట్రేడ్ డీల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాన్ని నేను ఆపేశాను అని ఆ దేశ మీడియాతో తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీని తుడిపాటు చర్యగా భారత్ మే 6-7 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్‌పై ప్రతీకార దాడులు జరిపింది.మే 10న, ట్రంప్ సోషల్ మీడియా వేదికగా, అమెరికా మద్యవర్తిత్వంతో జరిగిన “దీర్ఘకాలిక చర్చల” అనంతరం భారత్, పాకిస్థాన్‌లు “తక్షణ విరామానికి” అంగీకరించాయని ప్రకటించారు.

అనంతరం ఈ వ్యాఖ్యను ఆయన పునరుద్ఘాటిస్తూ, తాను ఈ రెండు అణ్వాయుధ సామర్థ్య దేశాల మధ్య ఉద్రిక్తతలను “శాంతియుతంగా పరిష్కరించడంలో సహాయపడ్డానని” పేర్కొన్నారు. ఇంకా, యుద్ధాన్ని ఆపితే రెండు దేశాలతో ట్రేడ్‌ను పెంచుతామని హామీ ఇచ్చినట్టు చెప్పారు.

Also Read:కుబేర…డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్

- Advertisement -