ఎంపీ కవితతో సన్ ఫౌండేషన్ ఎండీ భేటీ..

446
MP Kavitha
- Advertisement -

నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవితతో సన్ ఫౌండేషన్ ఎండీ కావేరి మారన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో సన్ ఫౌండేషన్ దత్తత గ్రామం పోతంగల్‌లో అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము.
ఐదేండ్లలో కేంద్రం నుండి అన్ని రకాలుగా నిధులు తేవడానికి కృషి చేశాను.. ఒక ఎంపీ కి ఏడాదికి 5 కోట్లు నిధులు మాత్రమే వస్తాయి వాటిని మెరుగైన కార్యక్రమాల కోసం ఉపయోగించగడం జరిగింది.. కార్పొరేట్ సంస్థలు తమ CSR funds వెచ్చించెందుకు ముందుకు వచ్చాయి. బీహెచ్ఈఎల్ నుండి 7 కోట్లు, సింగరేణి నుండి కొన్ని నిధులు సేకరించాం.. అని ఆమె తెలిపారు.

(ఎమ్మెల్సీ లక్కీ చాన్స్‌ వీరికే సిద్ధమైన జాబితా చూడండి..https://goo.gl/76Fd3e)

గతేడాది సన్ నెట్వర్క్ కోటిన్నర నిధులు ఇచ్చింది.. ఆ నిధులతో మా స్వగ్రామం పోతంగల్‌లో స్కూల్ కాంప్లెక్స్, యూత్ కోసం లైబ్రరీ, ఫంక్షన్ హాల్, చిల్డ్రెన్స్ పార్క్ నిర్మాణంతో పాటు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ప్రణాళికలు రూపొందించాం. వేసవిలోగా పనులు పూర్తవుతాయి. జరుగుతున్న పనులపై సన్ నెట్వర్క్ ఫౌండేషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బందువులు భోజనానికి ఇబ్బంది పడకుండా సొంతంగా భోజన సదుపాయం కల్పిస్తున్నాను. గత సంవత్సరం నవంబర్ 8న ప్రారంభించిన ఈ కార్యక్రమంను భోజన వితరణ కార్యక్రమాన్ని నేనే పర్యవేక్షిస్తున్న.. భోజన వితరణ కార్యక్రమం బాగా జరుగుతున్నది..

MP Kavitha

అలాగే నిజామాబాద్ లైబ్రరీ లోనూ భోజనం పెడుతున్నాం. ఈ ఏడాది కోటిన్నర నిధులు భోజన వితరణ కార్యక్రమానికి ఉపయోగించాలని సన్ ఫౌండేషన్ కోరింది.. వారికి ధన్యవాదాలు. హైజినిక్ ఫుడ్ అందించేందుకు సొంతంగా కిచెన్ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నం. జిల్లా కలెక్టరు, మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగేలా వారికి అప్పగిస్తం. కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు సన్ ఫౌండేషన్ ఎండి కావేరి మారన్, జెమిని కిరణ్ కు కృతజ్ఞతలు.అని ఎంపీ కవిత తెలిపారు.

కొత్త మంత్రులకు షాక్‌ ఇచ్చిన కేసీఆర్‌..(https://youtu.be/v0a9AIMXlfo)

- Advertisement -