వేసవిలో మొబైల్స్..యమ డేంజర్!

22
- Advertisement -

వేసవి కాలంలో విపరీతమైన ఎండల కారణంగా మొబైల్స్ విషయంలో జాగ్రత్త వహించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడం వల్ల ఎలక్ట్రానిక్ వస్తులపై ఆ ప్రభావం చాలానే ఉంటుంది. మరి ముఖ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మొబైల్స్ వేడెక్కుతుంటాయి. సాధారణంగా మొబైల్స్ తరచూ వాడడం వల్ల వేడెక్కడం సహజం. అయితే వేసవిలో బయటి ఉష్ణోగ్రత కూడా అధికంగా ఉండడం వల్ల మొబైల్ టెంపరేచర్ మరి ఎక్కువగా పెరుగుతుంది. తద్వారా ఫోన్ హ్యాంగ్ అవ్వడం, లేదా స్విచ్ ఆఫ్ కావడం, సిగ్నల్స్ సరిగా అందకపోవడం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో మొబైల్స్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మొబైల్స్ ఎక్కువగా యూస్ చేసే వారు వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

* ఎండలో మొబైల్ ఏ మాత్రం యూస్ చేయకూడదు. ఎండ కారణంగా మొబైల్ బ్యాటరీ వేడెక్కి త్వరగా పాడవడం జరుగుతుంది. అంతే కాకుండా మొబైల్ పర్ఫామెన్స్ కూడా తగ్గుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

* ఈ వేసవిలో అవసరమైనప్పుడు తప్పా మిగతా టైమ్ డేటా ఆఫ్ చేసుకోవాలి. లేదంటే బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతూ మొబైల్ వేడెక్కెలా చేస్తాయి. తద్వారా ఫోన్ త్వరగా పాడవుతుంది.

* వేడి అధికంగా ఉండే చోట్ల ఏ మాత్రం చార్జింగ్ పెట్టకూడదు. ఎందుకంటే సాధారణంగానే చార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కుతుంది. ఇంకా దానికి తోడు బయటి ఎండ తీవ్రత కూడా తోడైతే ఫోన్ మరింత వేడెక్కి పేలిపోయే అవకాశం ఉంది.

* ఈ వేసవిలో ఫోన్ వేడిని తగ్గించేందుకు కొంతమంది మొబైల్ ను ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఫోన్ లోని సున్నితమైన విభాగాలు దెబ్బ తింటాయి. కాబట్టి మొబైల్ ను ఏ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.

* ఇక ఈ వేసవిలో ఫోన్ అధికంగా హిట్ ఎక్కినప్పుడు కొద్దిగా నీటిలో తడిపిన బట్ట తీసుకొని మొబైల్ ను తుడవాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ వేడి తగ్గే అవకాశం ఉంది.

అన్నిటికంటే ముఖ్యంగా వేసవి కాలంలో మొబైల్ కు వీలైనంతా దూరంగా ఉండడం మంచిదని చెబుతున్నారు టెక్ నిపుణులు.

Also Read:‘రాజ్యాంగం రద్దు’.. బీజేపీ ప్రయత్నమదేనా?

- Advertisement -