నడినెత్తిన నిప్పుల కుంపటి

616
heat summer hyderabad
- Advertisement -

ఎండలు మండుతున్నాయి. ఎండల్లో బయటకు వెళ్తున్నారా జర జాగ్రత్త! ఈ సంవత్సరం భానుడు నిప్పుల వర్షం కురిపిస్తుండడంతో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రమాదం పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజురోజు కూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్క బోతతో జనాలు బేజారు అవుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

బయటకు రావాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. గత దశాబ్దకాలంగా పోలిస్తే ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. సముద్ర ఉపరితలం నుంచి వీస్తున్న వేడి గాలులకు తోడు, భూ గర్భ జలాల శాతం రోజురోజుకూ పడిపోతుండడంతో వాతావర ణంలో తేమ తగ్గిపోతుందని, దీంతో ఎండల తీవ్రత పెరుగుతోంద ని వాతావరణ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం మరొక కారణంగా చెప్పుకోవచ్చునంటున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ 45వరకు చేరుకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అయితే పెరుగుతున్న ఎండ తీవ్రత వల్ల వడ దెబ్బ బాధితుల సంఖ్య పెరిగే అవకాశాలు న్నాయయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎండలో తిరిగేవారు ఈ జాగ్రత్తలు పాటించాలి

1. ఎండలో తిరిగేవారు తలకు, ముఖానికి ఎండ తగలకుండా టోపీ, గొడుగు వంటి వాటిని ఉపయోగించాలి.
2. ప్రతి మనిషి రోజూ 5 లీటర్ల మంచినీరు తాగాలి
3. కొబ్బరినీళ్లు, పళ్లరసాల లాంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
4. ఆహారపదార్థాలలో మసాలాలు, కారం తగ్గించాలి
5. వేపుడు పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్, కాఫీ, ఆల్కహాల్, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్ తగ్గించాలి.
6. వ్యాయామం తగ్గించి, ఉదయం సమయంలో యోగా, వాకింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం.
7. వదులుగా ఉండే కాటన్ వస్ర్తాలు ధరించాలి
8. పసిపిల్లలకు ఉదయం 8లోపు, సాయంత్రం 6తరువాత మాత్రమే స్నానం చేయించాలి.
9. శిశువులకు అధికంగా తల్లిపాలు పట్టాలి. రబ్బర్ డైపర్లు వాడొద్దు.

Also Read:చెన్నైలో రామ్ చరణ్.. ‘గేమ్ ఛేంజర్’

- Advertisement -