వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ తలనొప్పి రావడం సాధారణం. అయితే, ప్రతి తలనొప్పి ఎండ వల్ల వచ్చిందే అనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు అది మైగ్రేన్ కూడా కావచ్చు.
తలనొప్పికి, మైగ్రేన్‌కు మధ్య తేడా ఏంటి?
ఎండ వల్ల వచ్చే తలనొప్పి (Heat Headache): ఇది సాధారణంగా తక్కువ లేదా మధ్యస్థంగా ఉంటుంది. తల అంతటా ఏదో ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుంది. నీళ్లు తాగి, కాసేపు విశ్రాంతి తీసుకుని శరీరాన్ని చల్లబరుచుకుంటే ఇది తగ్గిపోతుంది.
మైగ్రేన్ (Migraine): ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. తలకి ఒక వైపున మాత్రమే తలపోటు (throbbing pain) రావడం దీని ప్రధాన లక్షణం. దీనితో పాటు వికారం, వాంతులు, కాంతి లేదా శబ్దాన్ని భరించలేకపోవడం వంటివి జరుగుతాయి.
డీహైడ్రేషన్: చెమట వల్ల శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవడం ప్రధాన కారణం.
ఎండ ప్రభావం: ఎక్కువ సేపు ఎండలో ఉండటం, కళ్లకు మిరుమిట్లు గొలిపే సూర్యకాంతి మైగ్రేన్ బాధితులకు ప్రేరకంగా (trigger) మారుతుంది.
జీవనశైలి మార్పులు: సరైన సమయానికి భోజనం చేయకపోవడం, నిద్ర లేమి, కెఫీన్ లేదా చల్లని పానీయాలు అతిగా తీసుకోవడం.
మైగ్రేన్ వచ్చేముందు కనిపించే ప్రారంభ లక్షణాలు:..మైగ్రేన్ నొప్పి మొదలయ్యే ముందే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది:
హఠాత్తుగా మూడ్ మారిపోవడం, చిరాకు లేదా నీరసం.
మెడ పట్టేయడం (Neck stiffness).
కాంతి, వాసన లేదా శబ్దాల పట్ల సున్నితత్వం పెరగడం.
కళ్ల ముందు మెరుపులు, జిగ్‌జాగ్ గీతలు కనిపించడం లేదా చూపు మసకబారడం (దీనిని ‘ఆరా’ అంటారు).
నివారణ మార్గాలకు కొన్ని చిట్కాలు:
రోజుకు సరిపడా నీరు తాగుతూ ఉండాలి.
ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు నేరుగా ఎండలో తిరగవద్దు.
బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ లేదా టోపీ ధరించాలి.
భోజనం మరియు నిద్ర సమయాలను క్రమబద్ధంగా ఉంచుకోవాలి.
యోగా లేదా ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.
ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి?
ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్ గుప్తా హెచ్చరిస్తున్నారు:
జీవితంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన తలనొప్పి అకస్మాత్తుగా వస్తే.
తలనొప్పితో పాటు జ్వరం, మెడ బిగుసుకుపోవడం లేదా ఫిట్స్ రావడం.
శరీరంలో బలహీనత, తిమ్మిర్లు లేదా మాట్లాడటంలో ఇబ్బంది కలగడం.
తలకు ఏదైనా గాయం అయిన తర్వాత తలనొప్పి రావడం.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వృత్తిరీత్యా వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
Also Read:మన ఓటును కాపాడుకోవాలి: SIRపై కేటీఆర్

