జీర్ణ సమస్యలకు చెక్ పెట్టండిలా!

59
- Advertisement -

వేసవికాలంలో చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే విపరీతమైన వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగి జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. తద్వారా పేగుల కదలికలో మార్పులు రావడం, ఎసిడిటీ వికారం వాంతులు వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వాతావరణంలోని మార్పుల వల్ల ఆహారం కూడా త్వరగా పాడవుతుంది. అలాంటి ఆహారాన్ని తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. తద్వారా మలబద్ధకం అతిసారం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి వేసవిలో జీర్ణ వ్యవస్థ సవ్యంగా జరగాలంటే మనం తినే ఆహారంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. వేసవిలో చాలామంది మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను తినడం మంచిది. .

తృణధాన్యాలు, వాల్ నట్స్, క్యాబేజీ, క్యారెట్, ఆకుకూరలలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు వీటిని ఆహార డైట్ లో చేర్చుకోవడం ఎంతో మంచిది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో తాజా పండ్లు ఎంతో ముఖ్యమైనది. యాపిల్స్, అత్తి పండ్లు, అరటిపండ్లు, బెర్రిస్, నారింజ వంటి పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను సవ్యంగా జరిపి జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉండేలా చూస్తుంది. ఇక వేసవిలో అతిసార, అజీర్తి వంటి సమస్యలు కూడా తరచూ ఉత్పన్నమౌతు ఉంటాయి.

వీటి నుంచి బయట పడేందుకు తినే ఆహారంలో పెరుగు, మజ్జిగ, కెఫీర్, సౌర్ క్రాట్.. వంటివి ఉండేలా చూసుకోవాలి. ఇక చాలా మందికి సీజన్ తో సంబంధం లేకుండా కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే వేసవిలో టీ లేదా కాఫీ అధికంగా సేవించాచడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కాఫీ లేదా టీ తాగడం తగ్గించాలి. వీటికి బదులుగా గ్రీన్ టీ, మాచా టీ, బ్లాక్ టీ వంటివి తాగడం మంచిది. జీర్ణ వ్యవస్థ సవ్యంగా జరిగేందుకు వేసవిలో నీరు ఎక్కువగా తాగడం ముఖ్యం. రోజుకు కనీసం 5-6 లీటర్ల నీరు తాగితే జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇంకా ఫ్యూట్ జ్యూస్, సలాడ్, వంటివి కూడా సేవిస్తూ ఉండాలి. అప్పుడే జీర్ణ వ్యవస్థ సవ్యంగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Also Read:#SDT18 ఇంటెన్స్ రోల్‌లో శ్రీకాంత్

- Advertisement -