ఏఎన్నాఆర్‌గా సుమంత్..!

225
sumanth
- Advertisement -

బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఎన్టీఆర్. లెజండరీ నటుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 3 నెలల గడిచిన షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. ప్రస్తుతం స్క్రీన్ ప్లే,స్టోరీ మార్పు చేర్పులతో బిజీగా ఉన్న క్రిష్ జూలై 5 నుంచి ఫస్ట్ షెడ్యూల్‌ షూటింగ్ మొదలుకానుంది.

ఎన్టీఆర్ సినీ,రాజకీయ జీవితంలో కీలకపాత్ర పోషించిన వారందరి పాత్రలు ఎన్టీఆర్ బయోపిక్‌లో ఉండనున్నాయి. ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఏఎన్నాఆర్ పాత్ర మరువలేనిది. ఈ నేపథ్యంలో ఏఎన్నార్ పాత్రను ఎవరు పోషిస్తారో అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

తొలుత ఏఎన్నార్‌గా చైతూ చేస్తాడనే వార్తలు వెలువడ్డాయి. కానీ తాజాగా సుమంత్ పేరు తెరమీదకు వచ్చింది. దర్శకుడు క్రిష్…ఏఎన్నార్‌గా సుమంత్‌ చేస్తే బాగుంటుందని బాలయ్య దగ్గర ప్రస్తావించాడట. బాలయ్య ఓకే చెప్పడంతో సుమంత్‌తో టెస్ట్ షూట్ చేయడానికి సిద్ధమయ్యాడు క్రిష్. మరి ఏఎన్నాఆర్‌గా సుమంత్ మెప్పిస్తాడా లేదా వేచిచూడాలి.

- Advertisement -