Sukumar:సుక్కు నెక్ట్స్ ఎవరితో?

34
- Advertisement -

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్ప పార్ట్ 1 మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాధించుకున్న సుకుమార్ తదుపరి సినిమాల కోసం అటు బాలీవుడ్ సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 తో బిజీగా ఉన్న సుక్కు తన తదుపరి సినిమా ఎవరితో అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. గతంలో విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తున్నాట్లు సుకుమార్ అఫిషియల్ గా ప్రకటించాడు. కానీ ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో ఉండే అవకాశం లేదని టాక్. మరి పుష్ప పార్ట్ 2 తర్వాత సుక్కు హీరో ఎవరు ? అంటే సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాంచరణ్ తో అనే టాక్ వినిపిస్తోంది. .

రాంచరణ్ సుకుమార్ కాంబినేషన్ లో గతంలో రంగస్థలం మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప పార్ట్ 2 తర్వాత రంగస్థలం పార్ట్ 2 ను తెరకెక్కించే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్టోరీ లైన్ కూడా రాంచరణ్ కు వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో పాటు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా ఓ మూవీకి కమిటయ్యాడు. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్ ప్రాజెక్ట్ ఉండే అవకాశం ఉందట. అయితే పుష్ప పార్ట్ 3 కూడా తెరకెక్కించే ఆలోచనలో సుకుమార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 తరువాత అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. దీన్ని బట్టి చూస్తే పుష్ప పార్ట్ 3 ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. మొత్తానికి సుకుమార్ నెక్స్ట్ హీరో ఎవరనే దానిపై కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తి క్లారిటీ రావాలంటే పుష్ప పార్ట్ 2 విడుదల వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read:రోహిత్ vs పాండ్య.. ముదురుతున్న వివాదం!

- Advertisement -