‘క‌న‌బ‌డుట లేదు’ టీజ‌ర్ లాంచ్ చేసిన సుకుమార్‌

288
kanabadutaledu
- Advertisement -

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ రోజు స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్ ‘క‌న‌బ‌డుట లేదు’ ఫిల్మ్ టీజ‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, “టీజ‌ర్ ఆస‌మ్‌గా చాలా బాగుంది. క్రియేటివ్‌గా ఉంది. షాట్‌కీ షాట్‌కీ క‌నెక్టివిటీ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఇలాంటి టీజ‌ర్ రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. బాల‌రాజుగారి టేకింగ్ చాలా బాగుంది. మ‌ధు పొన్నాస్ బీజీయం హాంట్ చేసేలా ఉంది. టీజ‌ర్‌లోని షాట్స్ చూస్తుంటే సందీప్ బ‌ద్దుల సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంద‌నిపించింది. ఈ సినిమాకి ప‌నిచేసిన టీమ్ అంతా ఇండ‌స్ట్రీకి చాలా గొప్ప‌గా ప‌రిచ‌య‌మ‌వుతార‌ని అనిపిస్తోంది. సుక్రాంత్‌తో స‌హా యాక్ట‌ర్స్ అంద‌రికీ మంచి బ్రేక్ రావాల‌ని కోరుకుంటున్నాను. నిర్మాత‌ల‌కు ఆల్ ద బెస్ట్. సినిమా చాలా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను” అన్నారు.

ఒక డంపింగ్ యార్డ్‌లో క‌నిపించిన రెండు శవాల గురించి పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు కానిస్టేబుల్ ఫిర్యాదు చేస్తుండ‌గా టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. చిత్రంలోని కీల‌క పాత్ర‌ల‌న్నింటినీ క్రియేటివ్ విధానంలో వైవిధ్యంగా ప‌రిచ‌యం చేశారు. శ‌శిత అనే త‌న ఫ్రెండ్ మిస్స‌య్యిందంటూ ఒక యువ‌తి పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చి కంప్ల‌యింట్ ఇవ్వ‌డం, ఆమెను సూర్య‌, అత‌ని స్నేహితులు చివ‌రిసారిగా చూశార‌ని చెప్ప‌డం, అనుమానితుడైన ఆదిత్య కూడా క‌నిపించ‌కుండా పోవ‌డం వంటి అంశాలు ఉత్కంఠ‌ను క‌లిగిస్తున్నాయి.

వీళ్లంతా ఎలా క‌నిపించ‌కుండా పోయారు? డ‌ంపింగ్ యార్డ్‌లో క‌నిపించిన శ‌వాలెవ‌రివి? వీటి వెనుక ఎవ‌రున్నారు? ఈ ప్ర‌శ్న‌లన్నింటికీ స‌మాధానం సినిమా విడుద‌ల‌య్యాకే తెలుస్తుంది.స‌న్నివేశాల్లోని మూడ్‌ను సంగీత ద‌ర్శ‌కుడు మ‌ధు పొన్నాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయ‌గా, సందీప్ బ‌ద్దుల సినిమాటోగ్ర‌ఫీ ఇంటెన్సిటీని పెంచింది.క‌థ‌ను చెప్ప‌డానికి డైరెక్ట‌ర్ బాల‌రాజు ఒక భిన్న‌మైన మార్గాన్ని ఎంచుకున్నార‌ని టీజ‌ర్ స్ప‌ష్టంగా తెలియ‌జేస్తోంది. ఇదివ‌ర‌కే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ రాగా, టీజ‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి.

సుక్రాంత్ వీరెల్ల హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో యుగ్రామ్‌, శ‌శిత కోన‌, నీలిమ ప‌త‌కంశెట్టి, సౌమ్యాశెట్టి, కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేమ్ రాజు, ఉమామ‌హేశ్వ‌ర‌రావు, కిశోర్‌, శ్యామ్‌, మ‌ధు కీల‌క పాత్ర‌ధారులు. స‌ర‌యు త‌ల‌శిల స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎస్‌. ఫిలిమ్స్‌, శ్రీ‌పాద క్రియేష‌న్స్‌, షేడ్ స్టూడియోస్ క‌లిసి నిర్మిస్తున్నాయి.

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌: మ‌ధు పొన్నాస్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌ందీప్ బ‌ద్దుల‌
ఎడిటింగ్‌: ర‌వితేజ కుర్మాన‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: స‌ర‌యు త‌ల‌శిల‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: బాల‌రాజు
బ్యాన‌ర్స్‌: ఎస్‌.ఎస్‌. ఫిలిమ్స్‌, శ్రీ‌పాద క్రియేష‌న్స్‌, షేడ్ స్టూడియోస్‌

- Advertisement -