తమిళ దర్శకుడు మథిమరణ్ పుగజేంద్రి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మండాడి’. ఈ సినిమాతో కోలీవుడ్‌లో ఛాన్స్ కొట్టేశాడు సుహాస్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ సుహాస్ తాను విలన్ పాత్రలో మాత్రమే నటిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో సూరి మాత్రమే హీరో అని ఆయన చెప్పారు.
ఈ సినిమాలో కథానాయికగా మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఆమె ‘అసురగురు’, ‘మగముని’ వంటి చిత్రాలు మరియు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ లో మంచి పాత్రలతో గుర్తింపు పొందారు. అలాగే, తమిళ బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన సచానా, ప్రముఖ కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించనున్నారు.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రదీప్ ఈ రఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీటర్ హైన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించనున్నారు. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వెట్రిమారణ్ పనిచేస్తుండగా, ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ అధినేత ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు.
Also Read:OMC Case:ఐఏఎస్ శ్రీలక్ష్మికి చుక్కెదురు!

