OMC Case:ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి చుక్కెదురు!

53
- Advertisement -

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమమైనింగ్ కేసులో ఆమెకు రిలీఫ్ దక్కేలా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సీబీఐ వాదనలు వినిపించగా సీబీఐ న్యాయవాదులతో ఏకీభవించింది సుప్రీం కోర్టు.

ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్‌ అధికారిణిని శ్రీలక్ష్మి అరెస్ట్ అయి కొంత కాలం జైలు జీవితం కూడా అనుభవించారు. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి ఆమెను డిశ్చార్జ్‌ చేయగా హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసులో ప్రధాన నిందితులైన గాలి జనార్దనరెడ్డితో పాటు బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్‌ అలీఖాన్‌లకు, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది.

Also Read:ఉగ్రశిబిరాలను తుడిచిపెట్టాం:సోఫియా ఖురేషి

- Advertisement -