సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’ ఫస్ట్‌లుక్..

164
Family Drama

టాలీవుడ్‌ నటుడు సుహాస్ హీరోగా ‘కలర్ ఫొటో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో సుహాస్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మళ్లీ హీరోగా ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా ‘ఫ్యామిలీ డ్రామా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా మా వస్తుంది. మెహర్ తేజ్ దీనికి దర్శకుడు. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఛాష్మ ఫిలిమ్స్ .. నూతన భారతి ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైటిల్ ‘ఫ్యామిలీ డ్రామా’నే అయినప్పటికీ, పోస్టర్ చూస్తుంటే క్రైమ్ నేపథ్యంలో సాగే కథగానే అనిపిస్తోంది. పూజా కిరణ్ – శృతి నోరి ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. వీరికి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. అజయ్ – సంజయ్ లు ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.