తెలుగు రాష్ట్రాల్లో నటుడు సుడిగాలి సుధీర్ పేరు తెలియని వారుండరు. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. అప్పుడప్పుడు వెండి తెరపై కూడా మెరుస్తున్నాడు. సుధీర్ సోలో హీరోగా చేస్తున్న తాజా చిత్రం గాలోడు. రాజశేఖర రెడ్డి పులిచర్ల ఈ చిత్రానికి దర్శకుడు. సుడిగాలి సుధీర్చిత్రం తరువాత ఆయన చేస్తున్న రెండవ సినిమా ఇది. ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
`అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్లు కష్టాల పాలవుతారు…కష్టాన్ని నమ్ముకున్న వాళ్లు అదృష్టవంతులవుతారు.. కానీ నేను ఈ రెండింటినీ నమ్ముకోను… నన్ను నేను నమ్ముకుంటా.. అంటూ సుధీర్ చెబుతున్న డైలాగ్ లతో టీజర్ మొదలైంది. టీజర్లో సుడిగాలి సుధీర్ నటించిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ని త్వరలోనే విడుదల కానుంది.

