బుల్లితెరపై ఎన్నో వినోదలను పండిస్తున్న షో జబర్దస్త్. ప్రతి గురు, శ్రుక వారల్లో జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రసారమవుతుంది. ఈ షో ప్రసారం అయ్యే సమయానికి అందరు టీవీల ముందు వాలిపోతారు. రష్మి వేసుకుని పొట్టి పొట్టి డ్రెస్‌లు,.. టీం లీడర్లు వేసే పంచ్‌లతో షో మొత్తం కామెడీకబ్ల్‌గా మారిపోతుంది.
అయితే ఈ షోలో టీం లీడర్ సుధీర్, యాంకర్ రష్మిలకు అఫైర్ ఉన్నట్లు ఆ మధ్యలో వార్తలు జోరుగా వచ్చాయి. సుధీర్‌తో రష్మీ డెటింగ్ చేస్తుందని… వీరిద్దరి స్నేహం రొమాంటిక్ రిలేషన్‌షిప్‌గా మారిందని చాలా రూమార్స్ ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళు కూడా ఈషోలో రూమర్స్ నిజమే అనే విధంగా ప్రవర్తిస్తుంటారు. దీంతో చూసే బుల్లితెర ప్రేక్షకులకు నిజంగానే వీరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని ఊహించుకుంటున్నారు.
తాజాగా రష్మీ రిలేషన్‌షిప్ పై వివరణ ఇచ్చాడు టీంలీడర్ సుధీర్… రష్మీకి తనకు ఎలాంటీ ఎఫైర్ లేదని స్పష్టం చేశాడు. ఇటీవలే ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించాడు సుడిగాలి సుధీర్. తమ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని కేవలం స్కిట్‌లో నవ్వులు జోడించడానికి తనను రష్మికి లింక్ చేస్తుంటారని తెలిపాడు. అంతేగాకుండా తనకు అమ్మాయిల పిచ్చి ఉన్నట్టు కొన్ని వెబ్‌సైట్ల లో పిచ్చి పిచ్చి రాతలు రాస్తుంటారని మండిపడ్డాడు.
వీటి వల్ల నా క్యారెక్టర్ చాలా చెడ్డదన్న ప్రచారం జరిగిపోయిందని దీంతో తనకు ఎవరూ పిల్లనివ్వడానికి కూడా ముందు రావట్లేదని ఆవేదన చెందాడు సుధీర్. కేవలం కామెడీ కోసం వాడిన డైలగులతో తనకు,రష్మికి అక్రమ సంబంధం అంటగట్టేశారని అన్నాడు. నిజానికి చెప్పాలంటే తన జీవితంలో ఇంతకు ముందే ఓ సారి లవ్ ఫెయిల్ అయిందని, తనకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని వివరించాడు. క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన తమ మధ్య ఏదో ఉన్నట్లు ఊహించుకోవడం సరికాదు అని గతంలో కూడా సుధీర్ ఎఫైర్‌పై రష్మీ స్పందించిన విషయం తెలిసిందే.