నైట్రో స్టార్ సుధీర్ బాబు విభిన్న చిత్రాలను చేస్తూ, పాత్రల అవసరాలకు అనుగుణంగా శారీరకంగా కూడా మార్పులు చేసుకుంటూ వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. ఆయన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్‌లో సినిమా సినిమాకి వైవిధ్యం కనిపిస్తుంది.
ఈరోజు సుధీర్ బాబు 18వ చిత్రం అధికారికంగా ప్రకటించారు. సెహరి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సినిమా చేయనున్నారు సుధీర్ బాబు. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సౌత్ బొంబాయికి చెందిన అరుణ్ గౌలి నుండి చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన సుబ్రమణ్యం వచ్చిన ఇన్‌ల్యాండ్ లెటర్ కార్డ్ కనిపిస్తుంది. ”క్రిటికల్: నీ రాక అవసరం.” అనే మెసేజ్ కూడా కార్డ్ పై వుంది. తుపాకీ, బుల్లెట్‌లు, పాత ఐదువందల రూపాయి నోటు, ల్యాండ్‌లైన్ ఫోన్ , సిగార్ తో పాటు పోస్టర్‌లో దేవాలయం, గ్రామ వాతావరణం కనిపిస్తుంది. అక్టోబరు 31న మాస్ సంభవం” అని ఆ రోజు వచ్చే అప్‌డేట్ ని గురించి పోస్టర్ లో సూచించారు మేకర్స్.
సుధీర్ బాబు 18 అనేది దైవిక అంశంతో కూడిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఈ కథ 1989 కుప్పంలో జరుగుతుంది. ఇది సరైన నేటివిటీ చిత్రం. ఇది సుధీర్ బాబును మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తుంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత: సుమంత్ జి నాయుడు
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో: వంశీ-శేఖర్
ఇవి కూడా చదవండి..