ఆ యంగ్ హీరోనే ర‌వితేజకి విలన్

10
- Advertisement -

దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ తో ప్ర‌స్తుతం ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ సినిమా చేస్తున్నాడు ర‌వితేజ‌. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మరో యంగ్ హీరో విలన్ గా కనిపించబోతున్నాడు. టాలీవుడ్‌లో ప్ర‌యోగాలు చేయ‌డంలో ముందుండే సుధీర్ బాబు, సినిమా సినిమాకీ కొత్త‌ద‌నం చూపిస్తూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం ‘హ‌రోం హ‌ర’ సినిమా చేస్తున్న సుధీర్, రవితేజ సినిమాలో ఓ ప్ర‌త్యేక పాత్ర చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా వ‌స్తున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌లో సుధీర్ బాబు విలన్ గా కనిపించబోతున్నాడు.

సుధీర్ బాబు కోసం దర్శకుడు హ‌రీష్ శంక‌ర్ ఓ కీల‌కమైన విలన్ పాత్రను డిజైన్ చేశాడట. అందుకే, ఈ పాత్రను చేయడానికి సుధీర్ బాబు కూడా వెంటనే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని స‌మాచారం. అలాగే, ఈ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ని, ఆ సాంగ్ ను మిల్క్ బ్యూటీ తమన్నాతో చేయించాల‌ని మేక‌ర్స్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఎలాగూ ఫేడ్ అవుట్ దశలో ఉన్న తమన్నా భారీ రెమ్యునరేషన్ కోసం ఎలాంటి సాంగ్స్ చేయడానికైనా సిద్ధంగా ఉంది.

కాబట్టి, రవితేజతో స్పెషల్ సాంగ్ కి తమన్నా కచ్చితంగా ఒప్పుకుంటుంది. ఈ మధ్య హాట్ స్టిల్స్ తో కుర్ర‌కారు గుండెల్లో చోటు సంపాదించుకుంది మిల్క్ బ్యూటీ. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ చేస్తున్న తమన్నా, మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను ఇస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. రీసెంట్ గా కూడా తమన్నా వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ లుక్‌ లో ఎద అందాల‌ను చూపిస్తూ దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక రవితేజ ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్’ తో పాటు జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ తో కూడా ఓ సినిమాను చేయ‌న్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ జ‌న‌వ‌రి 26న రానుంది. ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న హీరోయిన్‌గా క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్‌ను ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ అమ్మ‌డుకు ఈ మేర‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చింద‌ని స‌మాచారం.

Also Read:26న బీఆర్ఎస్‌పీపీ సమావేశం

- Advertisement -