మరో పాన్‌ఇండియా సినిమాతో ‘సుధీర్ బాబు’

11
- Advertisement -

వైవిధ్య‌మైన చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న క‌థానా య‌కుడు సుధీర్ బాబు. న‌వ ద‌ళ‌ప‌తిగా అభిమానుల మ‌న్న‌న‌లు అందుకుంటున్న ఈయ‌న ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నారు. ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంద‌నుంది.

ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా, లార్జ‌ర్ దేన్ లైఫ్ స్టోరీ లైన్‌తో ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌బోతున్నఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యాన‌త ఉంది. వెంట్ క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జూన్ 14న విడుద‌లైన‌ హ‌రోంహ‌ర చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్‌గా స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. అందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు, గ్రిప్పింగ్ క‌థ‌నంకు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో ఇప్పుడు సుధీర్ బాబు చేయ‌బోతున్ పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ఆ వివ‌రాల‌ను తెలియజేస్తారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చిలో విడుద‌ల చేయ‌నున్నారు.లోతైన క‌థ‌తో రానున్న ఈ చిత్రంలో కుట్ర, ప‌న్నాగాలు క‌ల‌గ‌లిసిన చెడుకి, మంచి జ‌రిగే యుద్ధంగా ఇండియ‌న్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెర‌కెక్క‌నుంది.

ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ న‌చ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్ష‌క‌ల ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సుకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

ప్రేర‌ణ అరోరా, శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌న పురాణాల‌తో అనుసంధానం చేయ‌బ‌డిన ఎన్నో ర‌హ‌స్యాల‌ను ఇది వెలికి తీస్తుంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఓ ప్ర‌త్యేక‌మైన అనుభూతిని క‌లిగిస్తుంది. సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నారు.

- Advertisement -