గోపిచంద్‌ అకాడమీలో సుధీర్ బాబు..

250
sudheer babu
- Advertisement -

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ పాత్రలో సుధీర్‌బాబు నటిస్తుండగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించనున్నారు. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ ,అబన్‌డన్షియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు,హిందీలో తెరకెక్కనుంది.

ఈ సందర్భంగా బ్యాడ్మింటన్‌ ప్రాక్టిస్ చేస్తున్న సుధీర్ బాబు…గోపిచంద్ పాత్ర కోసం సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. బ్యాడ్మింటన్ తన తొలిప్రేమని తిరిగి నా తొలి ప్రియురాలు (బ్యాడ్మింటన్‌) దగ్గరికి వచ్చానని ట్వీట్ చేశాడు. తొలి ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందని అందరూ అంటుంటారు (సరదాగా). పుల్లెల గోపీచంద్‌కు సిద్ధమౌతున్నా అని
అన్నారు.

ఇప్పటికే క్రీడాకారులకు సంబంధించి మేరీ కోమ్‌ , ఎమ్‌.ఎస్‌. ధోనీ , ‘సచిన్‌’ బయోపిక్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మరి గోపిచంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

- Advertisement -