Sudan:ఆర్మీ-పారామిలటరీ మధ్య ఘర్షణ

44
- Advertisement -

సుడాన్‌లో ఆర్మీ – పారామిలటరీ మధ్య ఘర్షణ తలెత్తింది. కాల్పుల విరమణ ఒప్పందనాన్ని ఉల్లంఘించడంతో జరిగిన ఘర్షణలో 400 మంది మృతిచెందగా 3500 మందికి పైగా గాయపడ్డారు. 2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్‭లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్ఎస్ఎఫ్‭తో ఆర్మీకి విభేదాలు తలెత్తాయి.

మరోవైపు సూడాన్‭లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు రెండు సీ-130 విమానాలు, ఒక నావెల్ షిప్పును ఏర్పాటు చేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతీయుల్ని క్షేమంగా అక్కడి నుంచి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది.

Also Read:రేవంత్ కన్నీరుకు కారణం కాంగ్రెసే ?

2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్‭లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సులను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన ఆర్మీ-పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇవి తారా స్థాయికి చేరడంతో మరణ మృదంగం కొనసాగుతోంది.

Also Read:వామ్మో.. ఇన్ని డ్రామాలా !

- Advertisement -