కొలీవుడ్ ఇండస్ట్రీని సుచి లీక్స్ ఒక్కసారిగా షేక్ చేసిన విషయం తెలిసిందే. సింగర్ కం యాంకర్‌గా తనదైన ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న సుచిత్ర లీక్స్ సినిస్టార్లకి చెమటలు పట్టించాయి. సుచి ట్విట్టర్ అకౌంట్ ద్వారా లీకైన సెలెబ్రిటీల రొమాన్స్ ఫొటోలు, వీడియోలు సంచలనం సృష్టించాయి. అయితే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ప్రయివేటు బూతు వీడియోలు, ఫోటోలు చూశాక స్టార్లంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు.
తమ వీడియోలు ఇంకా 1టెరాబైట్ హార్డ్ డిస్క్‌లో నిక్షిప్తమై ఉంటే తమ పరిస్థితి ఏంకాను? అంటూ ఎవరికి వారు బయాంధోళనలో ఉండిపోయారు. అయితే కొందరు స్టార్లు తమ వీడియోలు, ఫోటోలు బయటపడిన వెంటనే ఏమాత్రం స్పందించలేదు. ఆ తర్వాత కొంతమంది స్టార్స్ స్పందించి వారి వెర్షన్ వారు చెప్పే ప్రయత్నంచేశారనుకోండి.
అయితే తాజాగా ఈ లీక్స్ పై స్పందించింది. ఈ లీక్స్‌తో తనకు ఏ సంబంధం లేదని సుచిత్ర స్పష్టం చేసింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి, ఈ పని చేశారని ఆరోపించింది. వాస్తవానికి ఎవరినీ నొప్పించడానికి తాను ఇష్టపడనని, తన తప్పు కానప్పటికీ… తన వల్ల బాధపడిన సెలబ్రిటీలందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది సుచిత్ర. శత్రువునైనా సరే అవమానపరిచే తత్వం తనది కాదని చెప్పింది.
ఈ షాక్ నుంచి కోలుకోవడానికి తనకు ఆరు వారాల సమయం పట్టిందని, తాను కోలుకోవడానికి తన భర్త, కుటుంబసభ్యులే కారణమని చెప్పింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి ఆ లీక్స్ పై సుచిత్ర ఇచ్చిన క్లారిటీతో మళ్ళీ ఆ సెలెబ్రిటీలు సుచీతో సత్సంబంధాలు కలుపుకుంటారో లేదో చూడాలి మరి.