జయ హో బాహుబలి..

228
action-king-praises-prabhas
action-king-praises-prabhas
- Advertisement -

వేయ్యి కోట్ల వసూళ్లు సాధించి సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. భాష, ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్, తన కూతురు ఐశ్వర్య ట్విట్టర్ లో ఈ సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఈ చిత్రం సాధించిన విజయానికి అర్జున్.. టీం సభ్యులను అభినందించాడు.

ప్రభాస్ ని మంచి మనసున్న వ్యక్తి ,స్వీట్ హార్ట్ అంటూ, జై హో బాహుబలి అంటూ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలోనే అర్జున్, ఐశ్వర్య బాహుబలి 2 చిత్ర షూటింగ్ సమయంలో ప్రభాస్, అనుష్క, రాజమౌళితో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు.

ప్రస్తుతం అర్జున్‌ మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవగౌడ తనయుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి. కుమారస్వామి పాత్రలో నటించనున్నారు. . ఆయన జీవిత చరిత్రను దర్శకుడు ఎస్‌.నారాయణ తెరకెక్కించను న్నారు.  కుమారస్వామి సీఎంగా ఉన్న 20 నెలల్లో ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేశారనే కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు ‘భూమిపుత్ర’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు.

- Advertisement -