చరిత్ర సృష్టించిన సుచిక తరియాల్

7
- Advertisement -

భారత మార్షల్ ఆర్ట్స్ అథ్లెట్ సుచిక తరియాల్ ఆసియా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో మహిళల ట్రెడిషనల్ 60 కేజీల కేటగిరీలో ఆమె కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఆసియా క్రీడల చరిత్రలో ఎంఎంఏ క్రీడ అరంగేట్రం చేయగా భారత్‌కు ఈ విభాగంలో దక్కిన మొట్టమొదటి పతకం ఇదే కావడం విశేషం.

ఈ విజయాంతో ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకి చేరింది.రింగ్‌లో సుచిక పోరాటంక్వార్టర్ ఫైనల్స్‌లో మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్ బైగల్మాపై 2-0 తేడాతో విజయం సాధించి సుచిక సెమీఫైనల్‌కు అర్హత సాధించడమే కాకుండా భారత్‌కు పతకాన్ని ఖాయం చేశారు. అనంతరం జరిగిన సెమీఫైనల్ పోరులో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ తెయోతో తలపడగా, ఎక్స్ట్రా రౌండ్‌లో 0-2 తేడాతో ఓటమి పాలయ్యారు. ఫైనల్‌కు చేరలేకపోయినప్పటికీ, కాంస్య పతకంతో సుచిక భారత క్రీడా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.

సుచిక తరియాల్ క్రీడా ప్రయాణం36 ఏళ్ల సుచిక తరియాల్ వివిధ మార్షల్ ఆర్ట్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అనుభవజ్ఞురాలు. 8 సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన సుచిక, 2019 కామన్వెల్త్ జూడో ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచారు. 2022 కామన్వెల్త్ క్రీడల్లో కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Also Read:Cult:#కల్ట్ అక్టోబర్ 30న

- Advertisement -