ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మలోని పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్లను నిషేధించడంతో పాటు విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించేందుకు సరికొత్త ప్రణాళికను ప్రకటించారు. రోమ్లో తన పార్టీ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ యువజన విభాగం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన మలోని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కొత్త నిబంధన ప్రకారం పాఠశాలల్లో ముఖం పూర్తిగా కనిపించకుండా ధరించే బుర్ఖా, కళ్లు మాత్రమే కనిపించే నిఖాబ్లపై నిషేధం విధించనున్నారు. అయితే కేవలం తలను మాత్రమే కప్పే ‘హిజాబ్’ ప్రస్తావనను ఇందులో చేర్చలేదు. ఇటలీ పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రతి తరగతిలో ఉండే విదేశీ విద్యార్థుల సంఖ్యకు చట్టబద్ధమైన గరిష్ఠ పరిమితి (Cap) విధించడం.
విద్యా వ్యవస్థలో సరిగ్గా కలవలేకపోతున్న విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇటాలియన్ భాష నేర్చుకోవాలి. బుర్ఖా, నిఖాబ్లపై నిషేధం: పాఠశాలల ప్రాంగణంలో ముఖాన్ని పూర్తిగా కప్పివేసే దుస్తులను (బుర్ఖా, నిఖాబ్) నిషేధించడం. ఇటలీకి వచ్చి ఇక్కడ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే ఎవరైనా మా భాష నేర్చుకోవాలి, మా సంస్కృతిని అర్థం చేసుకోవాలి మరియు మా నిబంధనలను గౌరవించాలి. కాబట్టి సాంప్రదాయం పేరుతో ఏ యువతి కూడా ముఖాన్ని దాచుకోవాలని ఇటలీలో నిర్ణయించకూడదు అన్నారు.
ఈ ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత, చట్టంగా మారడానికి 60 రోజుల్లోగా ఇటలీ పార్లమెంట్ ఆమోదించాలి. ఇటలీలో 2027లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వలసలు మరియు జాతీయ అస్తిత్వం వంటి సున్నితమైన అంశాలపై పట్టు సాధించి తన ప్రజాదరణను నిలబెట్టుకోవడానికి మలోని ఈ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం ఫ్రాన్స్, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 24 దేశాల్లో బుర్ఖా, నిఖాబ్లపై ఆంక్షలు అమలులో ఉన్నాయి.
Also Read:Cult:#కల్ట్ అక్టోబర్ 30న

