సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా?

42
- Advertisement -

కళ్యాణ్ రామ్ అంటే ఓ ప్రయోగం. కెరీర్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కళ్యాణ్ రామ్. తాజాగా బింబిసార అనే ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కళ్యాణ్ రామ్ ఆ సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్ తో ఇప్పుడు అమిగోస్ అనే సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు.

ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ తో ఓ కొత్త ప్రయోగం చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. రాజేంద్ర రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ , ట్రైలర్ తో కళ్యాణ్ రామ్ అంచనాలు పెంచాడు. కానీ ప్రమోషన్స్ వీక్ గా ఉండటంతో ఆశించిన బజ్ మాత్రం లేదు.

బింబిసార సక్సెస్ తర్వాత కళ్యాణ్ రామ్ నుండి వస్తున్న సినిమా కావడంతో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ సినిమాకు మరో పోటీ కూడా లేదు. ఏ మాత్రం టాక్ బాగున్నా కళ్యాణ్ రామ్ మరో బ్లాక్ బస్టర్ కొట్టే అవకాశం ఉంది. మరి చూడాలి నందమూరి హీరో సక్సెస్ ను కంటిన్యూ చేస్తాడా ? నిరాశ పరుస్తాడా ?

ఇవి కూడా చదవండి…

బాలయ్య పశ్చాత్తాపం.. ఇక ఆపేయండి

ఆ దర్శకుడితో చరణ్.. నిజమేనా ?

పఠాన్‌పై నిషేధం.. ప్రదర్శిస్తే మూడేళ్ల జైలు

- Advertisement -