స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత ఇంతవరకూ ఏసినిమాను చేయట్లేదు. విక్రమ్ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడని ప్రకటించినా అది ఇంతవరకూ పట్టాలెక్కలేదు. విక్రమ్ కుమార్ స్క్రీప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించున్నారని సమాచారం. ఇన్ని రోజలు గ్యాప్ రావడంతో చాలా నిరాశతో ఉన్నాడట బన్నీ. అందకే ఒకే సారి మూడు సినిమాలకు సైన్ చేశాడని సమాచారం.
మొదట విక్రమ్ కుమార్ తో సినిమా తీయగా..ఆతర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో మరో సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గలంతో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో అరవింద సమేత వీరరాఘవ సినిమాతో బిజీగా ఉండగా దసరాకు ఈసినిమాను విడుదల చేయనున్నారు. అంతలోపు బన్నీ విక్రమ్ కుమార్ తో సినిమాను పూర్తి చేసుకొనున్నాడు.
ఇక వీరిద్దరితో పాటు మరో దర్శకుడిని కూడా బన్నీ లైన్ పెట్టినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సరైనోడు సినిమాకు హిందీ వర్షన్ లో యూట్యూబ్ లో మంచి రెస్పాస్ రావడంతో బన్నీ ఒక హిందీ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. బాలీవుడ్ డైరెక్టర్ తో హిందీలో చేయనున్నాడా లేదా తెలుగులోనే బాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడా అనే విషయం పై ఇంకా క్లారీటి లేదు. మొత్తం బాలీవుడ్ డైరెక్టర్ తో బన్నీ చర్చ జరపడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.