జనసేన తరపున ప్రచారం చేయడానికి మెగా హీరోలు రానున్నట్లు సోషల్ మీడియాలో విసృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకూ ఒక్క నిహారిక తప్ప మిగతా వాళ్లు ఎవరూ ప్రచారంలో పాల్గోనలేదు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు నరసాపురం నుంచి పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తరపున ప్రచారం చేయడానికి వరుణ్ తేజ్, అల్లు అర్జున్ వస్తారని ఓ ఇంటర్యూలో తెలిపారు నాగబాబు భార్య పద్మజ. తాజాగా ఇదే విషయానికి సంబంధించి స్పందించారు అల్లు అర్జున్.
జనసేన పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేస్తున్న నాగబాబుకు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు. ప్రజాసేవను మార్గంగా ఎంచుకున్న నాగబాబు గారికి తన శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో నాగబాబు గారు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఎప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో మేము మి పక్కన నిలుచుని ప్రచారం చేయలేకపోయినా అన్ని విధాలుగా అండగా నిలబడతామని చెప్పారు. జనసేన పార్టీతో పాటు పవన్ కల్యాణ్ గారు కూడా సక్సెస్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. బన్ని ప్రచారానికి రాను అను క్లారీటి ఇవ్వగా వరుణ్ తేజ్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. నాగబాబు తరపున మెగా హీరోలు ప్రచారానికి వస్తే గెలుపు సులభం అవుతుందని భావిస్తున్నారు జనసేన అభిమానులు.