విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంతో సిద్దహస్తుడు దర్శకుడు విక్రమ్ కుమార్. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం విక్రమ్ కుమార్ బన్నీ కోస కథను సిద్దం చేశాడని.. ఆస్టోరీలో సెకండాఫ్ మార్చాలని బన్నీ కోరాడని సమాచారం. విక్రమ్ కుమార్ సెకండాఫ్ ను చక్కదిద్దే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. ఈకారణంతో ఈక్రేజీ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం బన్నీ దర్శకుడు విక్రమ్ కుమార్ కే ఒక కథను వినిపించాడని తెలుస్తుంది.
ఈనేపథ్యంలో ఇటివలే ఓ తమిళ రచయిత బన్నీకి కథను వినిపించాడట. ఆకథ కొత్తగా ఉండటంతో బన్నీకి నచ్చేసిందని టాక్. ఈ కథను పట్టాలెక్కించేందుకు చాలా ఉత్సాహాంగా ఉన్నాడు బన్నీ. ఈసినిమాకు దర్శకుడిగా విక్రమ్ కుమార్ ను పెట్టాలని భావిస్తున్నాడు బన్నీ. దింతో ఆ రచయితతో విక్రమ్ కుమార్ కు స్టోరీ వినిపించాడట బన్నీ.
దీంతో విక్రమ్ కుమార్ కూడా ఈసినిమాకు దర్శకత్వం వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తరువాతనే బన్నీ – విక్రమ్ కుమార్ ల ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అంతలోపు విక్రమ్ కుమార్ కూడా వేరే హీరోతో సినిమా చేసే పనిలో ఉన్నాడని సమాచారం.