కట్నంగా కిడ్నీలు..ఇంత దారుణమా!

8
- Advertisement -

కట్నంగా కోడలి కిడ్నీ అడిగారు ఓ అత్తామామలు. బీహార్ రాష్ట్రం ముజఫర్‌పుర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మిఠన్‌పురాకు చెందిన దీప్తికి బోచహాన్‌ ప్రాంత యువకుడితో 2021లో వివాహం జరిగింది.

మొదట్లో అంతా బాగానే ఉన్నా.. రానురాను యువతికి అత్తింటి వేధింపులు పెరిగాయి. అదనపు కట్నంగా నగదు, బైకు తీసుకురావాలని వేధింపులు చేశారు. ఈ క్రమంలో ఆమె భర్త కిడ్నీల్లో ఒకటి పాడవడంతో.. కొత్త మలుపు తిరిగింది అత్తామామల వేధింపులు.

కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ భర్త, అత్తామామలు ఆమెను చావబాది ఇంటి నుంచి గెంటివేశారు. పుట్టింటికి వెళ్లిన బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దీప్తి భర్త, అత్తామామలు సహా మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చినట్లు ముజఫర్‌పుర్‌ రూరల్ ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.

Also Read:‘ఉస్తాద్ భగత్ సింగ్’.. షూట్‌లో పవన్

- Advertisement -