విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి వారిలో నైపుణ్యాన్ని పెంపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలపై బుధవారం ఆయన అధికారులతో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ప్రణాళికా బద్ధంగా కార్యాచరణతో వాటిని నిరుద్యోగ యువతకు అందించాలని అన్నారు. టెన్త్, ఇంటర్ స్థాయి విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి ని సారించాలని వినోద్ కుమార్ సూచించారు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట రమణ, కార్యదర్శి శ్రీనివాస్ రావు, టాస్క్ సి ఈ ఓ శ్రీకాంత్ సిన్హా, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులు మధుకర్ బాబు, ప్రశాంత్ పాల్గొన్నారు.
Students Need to Develop Soft Skills says telangana planning commission vice chairman Vinod Kumar