నూతన పెన్షన్ పాలసీ ప్రారంభించిన మంత్రి..

21

అనంతపురం జిల్లా రొద్దం మండలంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ పాలసీ రూ. 2500 కార్యక్రమాన్ని మంత్రి శంకర్ నారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే పెన్షన్ పేద కుటుంబాలలోని అవ్వా తాతలు, వితంతువులు, నేతన్నలు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరిమహిళలు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు లబ్ది చేకూరుతుందని తద్వారా వారిలో ఆత్మాభిమానం మరింత పెంచిందన్నారు. వారందరికీ పెన్షన్ ను దశలవారీగా మూడు వేల రూపాయల వరకు ప్రభుత్వం పెంచడం జరుగుతుందన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతీనెలా మొదటి తేదీ తెల్లవారు జామునే సంబంధిత లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కుల, మత, రాజీకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నామన్నారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో వినూత్నమైన సంక్షేమ పధకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు.