- Advertisement -
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.6గా ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలను ఇండోనేషియా జారీ చేసింది. భూకంప కేంద్రం నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు ప్రమాదకరమైన సునామీ తరంగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది.
యురోపియన్-మెడిటరేనియన్ సెసిమాలజికల్ సెంటర్ భూకంప తీవ్రతను 7.7గా అంచనా వేసింది. ఫ్లోరేస్ సముద్రంలో సుమారు 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. తెల్లవారుజామున 3. 20 నిమిషాలకు భూకంపం వచ్చింది.
- Advertisement -