పర్యావరణ పరిరక్షణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష..

246
- Advertisement -

ప్రగతిభవన్‌లో పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కలప స్మగ్లింగ్‌కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. పోలీసుల సహకారంతో కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని, తరచూ స్మగ్లింగ్‌కు పాలపడే వారిపై పీ.డి. యాక్టు నమోదు చేయాలని చెప్పారు. కలప స్మగ్లర్లు ఎంతటి వారెైనా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తయినా, ఏ రాజకీయ పార్టీకి చెందినా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

CM KCR

రాష్ట్రంలో కోట్లాది మొక్కల పెంపకం, అడవి పునరుద్దరణ పటిష్టంగా జరగాలని సూచించారు. రాష్ట్రంలో కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టాలి. కలప స్మగ్లింగ్ అరికట్టడంపై కార్యాచరణ రూపొందించుకుని రంగంలోకి దిగాలన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాల్సిందే. హైదరాబాద్ నగరం లోపల, బయట పచ్చదనం పెంచాలి. పర్యావరణ పరిరక్షణను 4 విభాగాలుగా విభజించుకుని చర్యలు తీసుకోవాల‌న్నారు.

ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌శర్మ, సీఎస్ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పీసీసీఎఫ్ పి.కె.ఝూ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -