ఆపరేషన్‌ కగార్‌ను ఆపేయాలి:సీతక్క

13
- Advertisement -

ఆపరేషన్ కగార్ పై స్పందించారు మంత్రి సీతక్క. ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపేయాలి అని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి… మధ్య భారతంలోని ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయి అన్నారు.

అక్కడ ఉన్న ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు ఉంటాయి… ఆ ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలనా విధానాలు ఉంటాయి అన్నారు. అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదు అన్నారు.

బల ప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఒక ఆదివాసీ బిడ్డగా కోరుకుంటున్నాను అన్నారు. ఆ జాతి బిడ్డగా వాళ్లకు నేను అండగా నిలుస్తాను.. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలి అని డిమాండ్ చేశారు.

Also Read:జలవిజ్ఞాన నిధి..విద్యాసాగర్ రావు

- Advertisement -