స్టోన్ ఫ్రూట్స్ తో క్యాన్సర్ కు చెక్!

39
- Advertisement -

ప్రకృతి ప్రసాధించే ఎన్నో రకాల పండ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. మెడిసన్ కూడా నివారించలేని కొన్ని రకాల వ్యాధులను ఆయా ఫలాలలో ఉండే పోషకాలు నివారిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ప్రతిరోజూ ఆహార డైట్ లో పండ్లను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక నేటి రోజుల్లో రకరకాల క్యాన్సర్ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్కసారి క్యాన్సర్ బారిన పడితే దాని నుంచి కోలుకోవడం అంతా తేలికైన విషయం కాదు. ఎన్ని రకాల మెడిసిన్స్ తీసుకుంటున్నప్పటికి సరైన ఫలితం కనిపించదు. అయితే క్యాన్సర్ కారకాలను నిర్మూలించడంలో స్టోన్ ఫ్రూట్స్ ఎంతగానో మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ హానికరమైన క్యాన్సర్ కరకాలను అడ్డుకుంటాయట..

ఇంకా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ ఏ, సి, ఇ.. వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపిస్తాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్ ఇ, బి 12, బి6 వంటివి తెల్ల రక్త కణాల వృద్దిని పెంచుతాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్ సి, ఏ వంటివి అలెర్జీ, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. ఇంకా ఈ స్టోన్ ఫ్రూట్స్ తినడం వల్ల అలసట, నీరసం, బద్దకం వంటివి కూడా దూరమౌతాయి. ఇంకా జుట్టు సంరక్షణకు అలాగే చలికాలంలో చర్మ సంరక్షణకు కూడా ఈ స్టోన్ ఫ్రూట్స్ తినడం ఎంతో మేలని చెబుతున్నారు ఆహార నిపుణులు. కాబట్టి ప్రతిరోజూ ఆహార డైట్ లో ఫ్రూట్స్ చేర్చుకోవడం మంచిది.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి మీ అవగాహన కొరకు అందించడం జరిగింది. క్యాన్సర్ మరియు ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

Also Read:NBK:బాలయ్య హ్యాట్రిక్ కొట్టేనా?

- Advertisement -