స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. రద్దీగా ఉండే బిజీ మార్కెట్లో ట్రక్కు పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు పాదచారులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు.
Something's happening on Drottninggatan and around Stockholm. pic.twitter.com/YPbrZSe5Mb
— Johnny Chadda (@johnnychadda) April 7, 2017
సిటీలోని అతిపెద్ద పాదచారుల స్ట్రీట్‌గా పేరుగాంచిన అహ్లెన్స్ డిపార్ట్‌మెంట్ స్టోర్ వద్ద ప్రమాదం జరగడంతో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి పక్కనే భారత రాయబార కార్యాలయం ఉంది. ఈ ప్రమాదంలో భారతీయులెవరూ గాయపడలేదని అక్కడి భారత రాయబారి మోనికా మెహతా వెల్లడించారు. పోలీసులు ప్రమాదస్థలాన్ని బ్లాక్ చేసి వాహన రాకపోకలను నిలిపివేశారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా దాడులకు పాల్పడేందుకు ఈ చర్యకు దిగారా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధించారు.స్వీడన్ ప్రజలకు భారత్ బాసటగా నిలుస్తుందన్నారు.