- Advertisement -
కరోనా వైరస్ దెబ్బకు చైనా అల్లాడిపోతోంది. కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా చైనాపై ప్రపంచదేశాల నుంచి ఒత్తిడికి తోడు ఒకేరోజు రూ. 28 లక్షల నష్టాన్ని చవిచూసింది. చైనా నుంచి వస్తున్న వారిపై ఆంక్షలు విధించడమే కాదు ఫ్లైట్స్‌ని రద్దు చేస్తున్నాయి.
చైనా స్టాక్ మార్కెట్ సోమవారం 8 శాతం పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.28 లక్షల కోట్లు పోయింది. గత నాలుగేళ్లలో చైనా ఇంత పెద్దమొత్తంలో నష్టపోవడం ఇదే తొలిసారి. చైనా దేశ కరెన్సీ యువాన్ కూడా భారీగా నష్టపోయింది.
ఇక ఇప్పటివరకు చైనాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య 361కి చేరింది. మరో 17,205 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరించగా, ఆదివారం ఒక్కరోజే 2,829 కొత్త కేసులు నమోదయ్యాయి.
- Advertisement -