యాషెస్ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ 13 టెస్టు శతకాలు సాధించి, ఈ పోటీల చరిత్రలో డాన్ బ్రాడ్‌మన్ (19 శతకాలు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జాక్ హాబ్స్ (12), స్టీవ్ వా (10), వాలీ హ్యామండ్ (9), డేవిడ్ గోవర్ (9) తదుపరి స్థానాల్లో ఉన్నారు. ఇది స్మిత్‌కు 37వ టెస్టు శతకం. దీంతో అతడు రాహుల్ ద్రవిడ్ (36)ను దాటి, టెస్టుల్లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (51), జాక్ కాలిస్ (45), రికీ పాంటింగ్ (41), జో రూట్ (41), కుమార్ సంగక్కార (38) తర్వాతి స్థానంలో ఉన్నాడు.
యాషెస్‌లో 3682 పరుగులతో స్మిత్, జాక్ హాబ్స్ (3636)ను దాటి రెండో అత్యధిక రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో బ్రాడ్‌మన్ (5028) అగ్రస్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ప్రత్యర్థి జట్టుపై 5000+ పరుగులు చేసిన నాలుగో బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన ఇతరులు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, డాన్ బ్రాడ్‌మన్.
ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియాలోని ఏడు వేర్వేరు వేదికల్లో టెస్టు శతకాలు సాధించిన ఐదో ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. అలాగే అషెస్ సిరీస్‌లో ఓపెనర్‌గా మూడు శతకాలు చేసిన అరుదైన జాబితాలో చేరాడు. సిడ్నీలో చేసిన 150 పరుగులు (152 బంతుల్లో) అషెస్ చరిత్రలో సంయుక్తంగా నాలుగో వేగవంతమైన 150గా నమోదయ్యాయి. ఈ సిరీస్‌లో హెడ్‌కు మొత్తం 600 పరుగులు.
ఇంగ్లాండ్ బౌలర్లకు ఈ యాషెస్ సిరీస్ కఠిన పరీక్షగా మారింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 50+ పరుగుల ఏడుసార్లు భాగస్వామ్యాలు నమోదయ్యాయి.ఇది టెస్టు చరిత్రలో రెండో అత్యధికం. జో రూట్ 41 టెస్టు శతకాలతో రికీ పాంటింగ్‌తో సమానంగా మూడో స్థానంలో ఉన్నాడు. 2021 నుంచి టెస్టుల్లో రూట్‌కు 24 శతకాలు, ఈ కాలంలో అత్యధికం. 150+ స్కోర్లు 17 ఉండగా, ఇది కొద్ది మందికే సాధ్యమైన ఘనత. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా 77 వికెట్లు పడగొట్టిన బెన్ స్టోక్స్, బాబ్ విల్లిస్‌తో కలిసి అత్యధిక వికెట్లు సాధించిన కెప్టెన్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read:నేపాల్‌లో మత ఘర్షణలు..ఉద్రిక్తం!

