రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ కేటాయింపులపై కేంద్రం సమీక్ష..

191
Minister Sadananda Gowda
- Advertisement -

రాష్ట్రాలకు రెమ్‌డెసివిర్ మెడిసిన్ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం సమీక్ష నిర్వహించాంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా రెమ్‌డెసివిర్ మెడిసిన్ కేటాయింపులు చేసినట్లు కేంద్ర మంత్రి సదానంద గౌడ వెల్లడించారు. రెమ్‌డెసివిర్ మెడిసిన్ ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రాలకు కేటాయింపులు పెంచినట్లు ఆయన తెలిపారు. 21 ఏప్రిల్ నుంచి 23 మే వరకు రాష్ట్రాలకు 76 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయింపు జరిగినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2,15,000 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కేటాయించినట్లు మంత్రి ప్రకటించారు.

- Advertisement -