నైట్ కర్ఫ్యూ..ప్రచార సమయాల్లో మార్పులు

143
sec

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నేటి నుండి లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ …ఎలక్షన్స్ జరిగే కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ప్రచారంపై పలు కీలక సూచనలు చేసింది.

ఎన్నికల ప్రచారం సమయాన్ని కుదించింది ఎస్ ఈ సి. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన కరోనా నిబంధనలు పాటిస్తూ రాత్రి 8 గంటల కు ప్రచారం ముగించాలని తెలిపింది.ఎన్నికల ప్రచారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు చేసుకోవచ్చని…..బహిరంగ సభ లు,లౌడ్ స్పీకర్ల వినియోగం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపయోగించవచ్చని పేర్కొంది.ప్రచారం లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.