అన్నిపోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్..

175
vikas raj
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌. మీడియాతో మాట్లాడిన ఆయన అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగనుంద‌ని .. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లో మెడిక‌ల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామ‌న్నారు.

మొత్తం 2,41,855 మంది ఓట‌ర్లు ఉన్నారని…. ఇందులో 50 మంది స‌ర్వీస్ ఓట‌ర్లు ఉన్నారు. 5,686 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు ఉన్న‌ప్ప‌టికీ, కేవ‌లం 739 మంది మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారని చెప్పారు. మంగళవారం సాయంత్రం 6 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుందని…బయటి నుండి ప్రచారానికి వచ్చిన వ్యక్తులు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లాలన్నారు.

నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని….ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రూ. 6.80 కోట్ల న‌గ‌దు, 4500 లీట‌ర్ల మ‌ద్యం సీజ్ చేశామ‌న్నారు. ప్రత్యేక యాప్ ద్వారా గంట గంట‌కు ఓటింగ్ శాతాన్ని తెలియ‌జేస్తామ‌ని, మంగళవారం సాయంత్రం 6 త‌ర్వాత బ‌ల్క్ మేసేజ్‌లు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

- Advertisement -